- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారాంతంలో తప్పని పెట్రో వాత!
దిశ, సెంట్రల్ డెస్క్: సుధీర్ఘమైన లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లు వేచి ఉన్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడిప్పుడే ధరల కొరడా ఝులిపిస్తున్నాయి. వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్‌లను పెంచాయి. శుక్రవారం చమురు సంస్థలు పేట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకూ పెట్రోల్ లీటర్‌కు రూ. 3.31, డీజిల్ రూ. 3.42 పెరిగింది. మార్చి 14 తర్వాత వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు చౌకగా ఉండటంతో ఆ ధర వద్ద ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10, డీజిల్‌పై రూ. 13 పెరిగింది. ఈ పెరుగుదల వల్ల వినియోగదారులపై ప్రభావాన్ని లేకపోయినా, ప్రభుత్వం ఈ పెరుగుదల నుంచి ఖచ్చితంగా భారీగా సంపాదించడం ప్రారంభించింది. ఈ పెరుగుదల తర్వాత, పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ. 32.98, డీజిల్‌పై లీటర్‌కు రూ. 31.83కు పెరిగింది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
* హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.41, డీజిల్ రూ. 71.16గా ఉంది.
* ఢిల్లీలో పెట్రోల్ రూ.74.57, డీజిల్ రూ.72.81.
* ముంబైలో పెట్రోల్ రూ. 81.53, డీజిల్ రూ.71.48.
* చెన్నైలో పెట్రోల్ రూ. 78.47, డీజిల్ రూ. 71.14గా ఉంది.
* బెంగళూరులో పెట్రోల్ రూ. 76.98. డీజిల్ రూ. 69.22గా ఉంది.