- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏసీపీ నరసింహరెడ్డిని కస్టడీ కోరుతూ పిటీషన్..
దిశ, క్రైమ్ బ్యూరో:
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న మల్కాజిగిరి ఏసీపీ నరసింహరెడ్డిని ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు శనివారం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం రావడంతో ఏసీపీ నరసింహారెడ్డికి సంబంధించిన బంధువులు, బినామీ ఇళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో 25 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఏసీపీ నరసింహారెడ్డి కూడబెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది. దీంతో కోర్టుకు రిమాండ్ చేసి, జైలుకు తరలించగా, ఏసీపీ అవినీతి అక్రమాలు, వ్యాపారాలు, బినామీలు, లాకర్లు తదితర అంశాలపై మరింత లోతుగా విచారించేందుకు ఏసీబీ కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటీషన్ పై కోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. ఈ మేరకు ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.