వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం..

by Shyam |   ( Updated:2020-03-06 21:40:30.0  )
వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం..
X

కోవిడ్-19(కరోనా)నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో మంత్రి ఈ మధ్య ఆస్పత్రుల చుట్టు బిజీబిజీగా తిరుగుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాను అరికట్టాలంటే అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.ఆస్పత్రుల్లో తిరుగుతున్నతనను ఆఫీసులోనే స్నానం చేసి ఇంటికి రావాలని తమ కుటుంబ సభ్యులు చెబుతున్నారని మంత్రి చమత్కరించారు. వైరస్ సోకిన వారు తప్ప ఇతరులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని, కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని ఈటల సూచించారు. అందుకే తాను మాస్కులు ధరించడంలేదని ఈటల స్పష్టం చేశారు.

Tags: carona, gandhi hospital, masks, carona virus not affected with air, maintain personal

Advertisement

Next Story

Most Viewed