- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ ఒకరిది.. శిక్ష మరొకరికి..
దిశ, జడ్చర్ల : అవమానభారం తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్పోసుకుని నిప్పంటించుకున్నాడో యువకుడు. 90 శాతం కాలిన గాయాలతో మహబూబ్నగర్జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాకలి శివ(23) అదే గ్రామంలో ఉంటున్న తన పెద్దనాన్న కూతురు(18) ఫోన్ నెంబర్‌ను వేరే యువకుడికి ఇచ్చి ప్రేమాయణం నడిపిస్తున్నట్లుగా అమ్మాయి కుటుంబీకులు అనుమానించారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్, పుట్టోజు శివతో పాటు అతని స్నేహితులు ఈనెల 23న బోయిన్‌పల్లి గ్రామంలో పథకం ప్రకారం చాకలి శివపై దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన శివ రక్షణ కల్పించాలని అదే రోజు రాత్రి మిడ్జిల్పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడికి పాల్పడిన ఐదుగురిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరాడు.
స్పందించిన ఎస్‌ఐ సురేష్ మరుసటి రోజు ఉదయం శివపై దాడి చేసిన వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించాడు. ఇంతలో కొందరు గ్రామపెద్దలు కల్పించుకుని బాధితుడు చాకలి శివ, తల్లి తండ్రులతో రాజీ కుదిర్చేందుకు చర్చలు జరిపారు. దీనిని అవమానంగా భావించిన శివ తనపై దాడిచేసిన ఐదుగురిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయకుండా, రాజీ చర్చలు జరుపడం ఏంటనీ క్షణికావేశంలో స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే మంట లార్పేందుకు ప్రయత్నించి ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజుల పాటు చికిత్స అనంతరం బాధితుడు చాకలి శివ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. మృతుడి శివ ఫిర్యాదు మేరకు చాకలి శ్రీకాంత్, పుట్టోజు శివతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వారిని శిక్షించండి..
నా కొడుకు చాకలి శివ (23) మృతికి కారణమైన ఐదుగురు దుండగులను చట్ట ప్రకారం శిక్షించాలని మృతుని తల్లిదండ్రులు చాకలి జంగమ్మ, చాకలి నర్సింహ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.
పోలీసు బందోబస్తు..
బోయిన్‌పల్లి గ్రామంలో జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందిని గ్రామంలో మోహరించారు. చాకలి శివ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు బందోబస్తును ఏర్పాటు చేయడం గ్రామంలో ఆసక్తికరంగా మారింది.