ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు.. పెళ్లి సాకుతో ఘరానా మోసం

by Sridhar Babu |   ( Updated:2021-10-02 07:45:04.0  )
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు.. పెళ్లి సాకుతో ఘరానా మోసం
X

దిశ, గోదావరిఖని : నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా మొహం చాటేసాడో ప్రియుడు. దీంతో బాధిత ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌కు చెందిన మనీషా శర్మ వృత్తి రీత్యా బ్యూటీ పార్లర్. గోదావరిఖనికి చెందిన సురేష్ అనే యువకుడు చదువు పూర్తయ్యాక జాబ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం గడిచాక అది కాస్త ప్రేమగా మారడంతో నిన్ను పెళ్లిచేసుకుంటానని ప్రియుడు అమ్మాయికి మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న నగదు, బంగారాన్ని తీసుకుని పారిపోయాడు.

మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రియుడిపై చివరకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడిన బాధితురాలు నేరుగా హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. వారు సరిగా పట్టించుకోకపోవడంతో నేరుగా గోదావరిఖనికి వచ్చి తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, సురేష్ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తానని తెలిపింది. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ రమేష్ బాబు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలి నుంచి వివరాలు సేకరించి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed