రాజకీయ సమావేశాలకు అనుమతి

by Shamantha N |
రాజకీయ సమావేశాలకు అనుమతి
X

దిశ, వెబ్‎డెస్క్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగునున్న నేపథ్యంలో రాజకీయ సమావేశాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. బీహార్ ఎన్నికలు, ఒక లోక్‌సభ, 56 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ సభలు, సమావేశాలకు 50 శాతం మందికి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30న కేంద్రం ‘అన్‌లాక్‌ 5.0’ నిబంధనల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకుంటే 100 మందికి మించకూడదని పేర్కొంది. ఈ నిబంధన కూడా ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుంది.

కాగా, ఎన్నికలు, ఉపఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ఆ నిబంధనను సవరిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌ భల్లా తాజా ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. హాళ్లు, ఆడిటోరియాల్లో జరిగే సభలు, సమావేశాల్లో.. ఆయా హాళ్ల సామర్థ్యాన్ని బట్టి 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. గరిష్టంగా 200 మంది పాల్గొనవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాల్లోనూ ప్రదేశాల సామర్థ్యాన్ని బట్టి 50 శాతం మందికి మించకూడదని పేర్కొన్నారు. సమావేశాల్లో పాల్గొనే వారు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం. భౌతికదూరం, మాస్కుల వినియోగం వంటివి పాటించాలని సూచించారు.

Advertisement

Next Story