- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లెక్సీలు కలకలం.. బద్వేల్ ఉప ఎన్నిక బహిష్కరణ
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బద్వేల్ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు ఉప ఎన్నికల బరిలో సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం షురూ చేయగా, అధికార వైసీపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేల్ బరిలో జనసేన పోటీ చేయడం లేదని శనివారం నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో వెల్లడించారు. దీంతో ఉప ఎన్ని్క ఉత్కంఠంగా మారింది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలపై వెలుగెత్తుతున్నారు. అంతేగాకుండా.. బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలో ఎన్నికల బహిష్కరణ ఫ్లెక్సీలు వెలిశాయి. చిన్నరాజుపల్లె గ్రామ ప్రజలు ఎలక్షన్స్‌ను బహిష్కరిస్తున్నట్లు తమ గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఏళ్లుగా రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.