రీల్ కు ప్రతి రీల్.. తిప్పి కొడుతున్న జనం...

by Kalyani |   ( Updated:2023-11-05 14:28:30.0  )
రీల్ కు ప్రతి రీల్.. తిప్పి కొడుతున్న జనం...
X

దిశ,భైంసా : ముధోల్ తాలూకా లో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ఓటర్స్ దృష్టిని ఆకర్షించడానికి రీల్స్ చేసి సోషల్ మీడియా వేదికను సైతం తమ ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నాయి పలు పార్టీలు. అదే సోషల్ మీడియా వేదికగా రీల్స్ ను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రత్యర్థివారు. తాజాగా ముధోల్ తాలూకా బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి ఎట్లుండే తెలంగాణ..! ఎట్లుండే తెలంగాణ..! ఇప్పుడేట్లఅయింది తెలంగాణ అంటూ చేసిన రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఇదే రీల్ ను ఆసరా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్ధులు ఎట్లుండే తెలంగాణ..! ఎట్లుండే తెలంగాణ..! అన్న మాటల తర్వాత గతంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్లాగ్ వాటర్ తో మునిగి ఉన్న భైంసా మండలంలోని గుండెగావ్ గ్రామ స్మశాన వాటిక ఫోటో ఉన్న రీల్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.



Advertisement

Next Story