కావాల్సింది ప్రధానికి ఇల్లు కాదు.. ప్రజలకు ఆక్సిజన్

by Shamantha N |
కావాల్సింది ప్రధానికి ఇల్లు కాదు.. ప్రజలకు ఆక్సిజన్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణకు కేంద్ర నిర్లక్ష్య వైఖరే కారణం అంటూ ప్రజలు, ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఆక్సిజన్ అని, ప్రధాన మంత్రికి ఇల్లు కాదని రాహుల్ గాంధీ అన్నారు.

ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ ​సెంట్రల్​ విస్టాపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. “దేశానికి కావలసింది ఆక్సిజన్​.. ప్రధాన మంత్రికి ఇల్లు కాదు” అని అన్నారు. ‘సెంట్రల్​ విస్టా’ క్రిమినల్​వేస్టేజ్ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్​(సెంట్రల్ విస్టా)ను కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో పార్లమెంట్, సచివాలయం, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ప్రధాన మంత్రి ఉండడానికి ఇల్లు నిర్మిస్తారు.

Advertisement

Next Story

Most Viewed