కుంభమేళాలో కరోనా నిబంధనలు పాటించని భక్తులు..

by Shamantha N |   ( Updated:2021-04-11 22:26:09.0  )
కుంభమేళాలో కరోనా నిబంధనలు పాటించని భక్తులు..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్కలు తీసుకుంటున్నాయి. కానీ ప్రజల్లో మాత్రం కరోనా భయం ఏ మాత్రం లేకపోవడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో కుంభ‌మేళా కొన‌సాగుతోంది. కుంభమేళాకు వచ్చిన భక్తులు కరోనా నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు.

పుణ్య స్నానాలు ఆచరిస్తూ.. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించడం లేదు. ఈ సంద‌ర్భంగా కుంభ‌మేళా ఐజీ సంజ‌య్ గుంజుయాల్ మాట్లాడుతూ.. కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం భక్తులు అంచనాకు మించి వస్తున్నారని అన్నారు. భక్తులే ఎవరికి వారు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రస్తుతం అక్కడ మాస్కులు లేని వారికి చలాన్లు విధించడం లేదని అన్నారు. కుంభమేళాకు భక్తులను ఉదయం ఏడు గంటల నుండి అనుమతిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story