రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించండి

by Shyam |
రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించండి
X

దిశ, వరంగల్:
కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు కల్గిన పేదలకు ఉచితంగా బియ్యం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ నేపథ్యంలో రేషన్ తీసుకోవడానికి షాపు వద్దకు వచ్చేవారు సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని బక్క రూప్ల తండా షాప్ నెంబర్ 41లో పలువురికి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. రేషన్ బియ్యం తీసుకునే సమయంలో సమూహంగా రావొద్దని సింగిల్ గా రావాలని సూచించారు. వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. సరసమైన ధరకే ప్రజలకు విక్రయించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, తహశీల్దార్ రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర రవి, సీఐ కరుణాకర్, ఎంపీపీ అరుణ రాంబాబు, జెడ్పీటీసీ శారద రవీందర్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కుడితి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags: ration rice, carona, lockdown,mla redya naik, white ration card

Advertisement

Next Story

Most Viewed