క్వారంటైన్ సెంటర్‌లో మందుబాబుల వీరంగం

by Aamani |
క్వారంటైన్ సెంటర్‌లో మందుబాబుల వీరంగం
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్ సెంటర్‎లో బుధవారం అర్ధరాత్రి ఓ మందు బాబు వీరంగం సృష్టించాడు. ఐసోలేషన్ కేంద్రంలో కరోనా పేషెంట్‌కి సంబంధించిన వ్యక్తులు గేటును ధ్వంసం చేయడంతో పాటు విధులు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందిని నానా దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఈ మేరకు హాస్పిటల్ సిబ్బంది జిల్లా కలెక్టర్, ఏరియా జనరల్ మేనేజర్‌తో పాటు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story