బిగ్‌బ్రేకింగ్.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఊహించని షాక్

by Anukaran |
బిగ్‌బ్రేకింగ్.. మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఊహించని షాక్
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో ఇనుగుర్తి మండల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం ఇనుగుర్తి గ్రామంలో ముత్యాలమ్మ దేవత విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొని తిరుగు ప్రయాణంలో గ్రామ ప్రజలు, ఇనుగుర్తి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇనుగుర్తి గ్రామాన్ని వెంటనే మండలం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి త్వరలోనే ఇనుగుర్తి గ్రామ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇవ్వడంతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసన కారులను తొలిగించారు.

Advertisement

Next Story