పేకాట రాయుళ్లకు జరిమానా

by Sumithra |
పేకాట రాయుళ్లకు జరిమానా
X

పేకాటరాయుళ్లకు నిర్మల్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి విద్యాసాగర్ రెడ్డి జరిమానా విధించారు. వివరాల్లోకెళితే..దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన 14 మంది బి.గంగాధర్, కొప్పుల శ్రీనివాస్, కొండజి విజయ, షేక్ సలీం, కొండజి సంజయ్, బొడ్డు శివలింగం, కండెల బోజ రెడ్డి, షేక్బాబు,A.ప్రదీప్, బొద్దుమల రాజేశ్,కండెల జీవన్ రెడ్డి,షేక్ మొయీన్,ఆరీఫ్,సట్ల భోజన్నలు గురువారం రాత్రి పేకాట ఆడుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు వారిని పేకాట ఆడుతుండగా పట్టకుని, వారి వద్ద నుంచి రూ.17,300 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధించారు.

Advertisement

Next Story

Most Viewed