- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీరు అక్కడికి పోవడంలేదా..? అయితే రూ. 10 వేల జరిమానా కట్టాల్సిందే
దిశ, ఆసిఫాబాద్: ఇంటర్ మూల్యాంకనానికి హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఆదేశాల మేరకు ఈ నెల 6న ప్రారంభమైన మూల్యాంకన క్యాంపునకు పలు కళాశాలల నుంచి జనరల్, ఒకేషనల్ సబ్జెక్టులకు పరీక్షకులుగా నియమించబడ్డారని.. వారిలో బోర్డు ఆదేశాల మేరకు రిలీవ్ కాకుండా ఉన్న లెక్చరర్లకు జరిమానా విధించనున్నారు. జిల్లాకు చేరువలో ఉన్న మంచిర్యాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంపులో హాజరు కాకుండా ఉన్న ఎగ్జామినర్లు వెంటనే రిపోర్టు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లందరూ అధ్యాపకులను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోకుంటే ఒక్కో లెక్చరర్ కు 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలిపారు.