- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంథని బాటలో పెద్దపల్లి.. క్యాంపునకు జై కొట్టిన లీడర్లు
దిశప్రతినిధి, కరీంనగర్ : మంథని కాంగ్రెస్ నాయకుల బాటలో మరో నియోజకవర్గ నాయకులు నడుస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే మంథనికి చెందిన సుమారు 40 మందిని హైదరాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే. వారిని గురువారం రాత్రి గోవాకు తీసుకెళ్లగా, శుక్రవారం పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా గోవాకు పయనం అయ్యారు. ఇదే బాటలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు క్యాంపుల బాట పడతారా? అన్న చర్చ మొదలైంది.
పోలింగ్ తేది సమీపిస్తున్నా కొద్దిగా సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు క్యాంపులకు వెల్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారా? లేక ఇతర పార్టీల నాయకుల జోక్యంతో ఈ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే లేకున్నప్పటికీ క్యాంపులకు తరలించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే ఇక్కడ అంతుచిక్కకుండా పోయింది. ముఖ్యనాయకుల అంతరంగంలో ఉన్న విషయం ఏంటో అర్థం కాకపోగా, ఈ క్యాంపులతో ఎవరికి లాభం చేకూరుస్తారన్నదే హాట్ టాపిక్‌గా మారింది.