- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్: అర్ధరాత్రి PDSU నేతలు అరెస్ట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా విద్యార్థి, పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, ప్రధాన కార్యదర్శి గౌతమ్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, సహాయ కార్యదర్శి కార్తీక్, నాయకులు దుర్గా ప్రసాద్‌లను నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, వర్నిల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పౌర హక్కుల సంఘం నాయకులు అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, నాయకులు సుధాకర్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి, పీవైఎల్ నాయకులు మారుతీలు మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టుల పేరుతో అర్ధరాత్రి అరెస్టులు చేయడం పౌర హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. అక్రమ అరెస్టులను ఖండించాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులను కోరారు.