12 కేజీల బియ్యం పంపిణీ స్టార్ట్..

by Shyam |
12 కేజీల బియ్యం పంపిణీ స్టార్ట్..
X

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వ్యాప్తి నిరోధానికి తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతున్నందున ప్రభుత్వం ప్రకటించిన 12కేజీల ఉచిత బియ్యం పంపిణీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12 కేజీల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. బియ్యం తీసుకోవడానిన ప్రజలందరూ ఒకేసారి రాకుండా ఎవరికి ఇచ్చిన కూపన్లలో ఉన్న సమయానికి తగ్గట్టు వారు రావాలని అధికారులు అధికారులు సూచించారు.

Tags: corona, lockdown, pds, telangana, rice distiribution

Advertisement

Next Story