- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లండ్ టూర్ వెళ్దామా వద్దా?
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ జట్టును కరోనా వైరస్ వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మంది క్రికెటర్లకు కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల్లో లాహోర్ నుంచి మాంచెస్టర్ వెళ్లాల్సి ఉండగా జట్టులోని 18 మంది ఆటగాళ్లకు, 11 మంది సహాయక సిబ్బందికి తిరిగి గురువారం పరీక్షలు నిర్వహిచారు. గతంలో పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లకు కూడా శుక్రవారం తిరిగి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల ఫలితాలను శనివారం పీసీబీ ప్రకటించనుంది. వైరస్ బాధితుల సంఖ్య పెరిగితే జట్టును ఇంగ్లండ్‌కు పంపొచ్చా లేదా అనే విషయంపై వైద్య నిపుణులను సంప్రదించనున్నారు. వైరస్ బారిన పడిన క్రికెటర్లను డబ్బిషైర్‌లో క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తే కోలుకుంటారని పీసీబీ భావిస్తున్నది. కానీ, ఇందుకు ఈసీబీ,ఇంగ్లండ్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. కరోనా రోగులను పెట్టుకొని ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం అవసరమా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఆటగాళ్లందరికీ కరోనా టెస్టుల చేసి నెగెటివ్‌గా తేలితేనే పర్యటనకు పంపుతామని గతంలో పీసీబీ చెప్పింది. కానీ, ఇప్పుడు ఆ నిబంధనలు సడలించాలని భావిస్తున్నది. మరోవైపు పాకిస్తాన్ పర్యటనకు రాకుంటే ఈసీబీకి 100 మిలియన్ డాలర్ల నష్ట పోనున్నది. అందుకే రూ.4.7కోట్లు వెచ్చించి చార్టెడ్ ఫ్లైట్ కూడా పంపిస్తున్నది.