- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూపర్ సోర్సింగ్‌లో పేటీఎం పెట్టుబడులు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, ఐటీ ఔట్‌సోర్సింగ్ ప్లాట్‌ఫామ్ సూపర్‌సోర్సింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. విజయ్ శేఖర్ శర్మతో పాటు ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ఇన్నోవ్8 సీఈఓ రితేష్ మాలిత్ సైతం ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడంతో సూపర్‌సోర్సింగ్ సంస్థ ఇప్పటివరకు రూ. 1.5 కోట్ల నిధులను సేకరించింది. ఐటీ ఏజెన్సీలతో కలిసి పనిచేసేందుకు సూపర్‌సోర్సింగ్ సంస్థ కంపెనీలకు సహయాన్ని అందిస్తుంది.
‘ఐటీ ఔట్‌సోర్సింగ్ పరిశ్రమపై నమ్మకాన్ని కలిగించడమే లక్ష్యంగా ఉన్నాము. సరైన పనిని, సరైన కంపెనీలకు, సరైన ధరల్లో అందించేందుకు కృషి చేస్తున్నామని’ సూపర్‌సోర్సింగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ మయాంక్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. కాగా, ఈ-కామర్స్, ఫుడ్,ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, ట్రావెల్ రంగాల్లో సూపర్‌సోర్సింగ్ సంస్థల తన సేవలందిస్తోంది. ఇప్పటివరకు సంస్థ 750కి పైగా ఐటీ ఏజెన్సీలను, 200కి పైగా క్రియాశీల క్లయింట్లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.