- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాడవాడలా అంబేద్కర్ జ్ఞాన జ్యోతులు !
దిశ, హైదరాబాద్ :
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులు, అంబేద్కర్ అభిమానులు ప్రతి ఇంటా జ్ఞాన జ్యోతులను వెలిగించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో.. ఈ రోజు ( ఏప్రిల్ 14 మంగళవారం) ఎవరికి వారు వారి ఇళ్లల్లోనే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అయితే, కొన్ని దళిత, బహుజన, సామాజిక సంఘాల నేతలు ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ తదితర సంఘాలు.. మంగళవారం రాత్రి ఇంటి బయట బాల్కనీలకు వచ్చి అంబేద్కర్ మహనీయునికి కొవ్వొత్తులతో నివాళులర్పించాలని పిలుపునిచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అంబేద్కర్ అభిమానులు వారి ఇళ్ళ ముందు కొవ్వొత్తులను (జ్ఞాన జ్యోతులను) వెలిగించి అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
Tags: Corona Effect, Ambedkar Jnana Jyothi, Ambedkar Jayanti, Ambedkar Youth Society, GPA