- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sai Dharam Tej: కోసం పవర్ స్టార్ Pawan Kalyan… ఫ్యాన్స్‌కు పండగే!
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టెప్పులేస్తే ఈలలు, మీసం తిప్పితే అరుపులు, సినిమా వస్తే ప్రభంజనం, ఆయన స్టేజ్‌పై కనిపిస్తే అభిమానులకు పూనకాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పవర్ స్టార్ మరో మెగా హీరో ఫంక్షన్‌లో కనిపిస్తే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా.. పవన్ కల్యాణ్ మరో మెగా హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ‘రిపబ్లిక్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే.
అయితే సాయితేజ్ ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై ఆపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మూవీ ప్రమోషన్స్ గురించి సినీ నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేసేందకు సిద్ధం చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడినా.. తేజ్ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో రంగంలోకి పవర్ స్టార్ దిగనున్నారు. ఈనెల 25వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ప్రీ రిలీజ్ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో ‘‘PAWAN KALYAN FOR SAI DHARAM TEJ’’ అనే ట్యాగ్‌తో చిత్ర యునిట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
The Pre-release event of #Republic turns massive with the presence of Shri @PawanKalyan.
Event – 25th Sept from 6PM
Venue: JRC CONVENTION, HYD.#RepublicFromOct1st#PawanKalyanForSDT@IamSaiDharamTej @aishu_dil @IamJagguBhai @meramyakrishnan@devakatta @JBEnt_Offl@ZeeStudios_ pic.twitter.com/8pRJFmZPpg— JB Entertainments (@JBEnt_Offl) September 23, 2021
- Tags
- guest