స్టీల్ ప్లాంట్‌పై గళం విప్పిన జనసేన అధినేత పవన్.. ఏమన్నారంటే..?

by srinivas |
pawan kalyan
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినతే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నిమ్మరసం తాగి దీక్ష విరమించిన పవన్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న నేనే నేరుగా కేంద్రంతో మాట్లాడుతున్నా.. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్న మీరు కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. వైసీపీ పార్టీకి తాము వ్యతిరేకం కాదని, కేవలం ఆ పార్టీ సిద్ధాంతాలు, పాలన విధానంపైనే మాట్లాడుతామని చెప్పారు.

అన్యాయంగా స్టీల్ ప్లాంట్ కోసం 152 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. అధికార వైసీపీ అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడాలన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వచ్చిందని.. ఇది కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవమని స్పష్టంచేశారు పవన్.. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడే దమ్ముందా అంటూ వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed