పవన్ విజ్ఞప్తి.. స్పందించిన కేంద్రం

by srinivas |
పవన్ విజ్ఞప్తి.. స్పందించిన కేంద్రం
X

ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్.. పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో పలు దేశాల్లో మిగిలిపోయిన భారతీయులను ఇప్పటికే దేశానికి రప్పించింది. ఈ నేపథ్యంలో యూకేలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తికి చేశారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం భారత విద్యార్థుల భయాందోళనలను ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జనసేనానితో ఫోన్‌లో మాట్లాడారు. యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహార, వసతి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తిమూలంగా వారు, వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారనే విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పారు. లండన్‌లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారు. ఎవరూ ఆందోళన చెందవద్దని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటామని అని కేంద్ర మంత్రి చెప్పారు.

Tags: Pawan Kalyan, central govt, indian students, in UK, twitter

Advertisement

Next Story

Most Viewed