ఓటేసిన పవన్.. ఎక్కడంటే?

by srinivas |
ఓటేసిన పవన్.. ఎక్కడంటే?
X

దిశ వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటేశారు. విజయవాడలోని పటమట లంక జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ పోలింగ్ కేంద్రంలోని బూత్ నెంబర్ 4లో పవన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ తొలిసారిగా ఓటు వేయడం విశేషం. పవన్‌తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఓటు వేశారు.

అటు ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. విజయవాడలోని పటమటలంక 9వ డివిజన్‌లో ఓటర్ స్లిప్పు, ఐడీ కార్డు ఉన్నా.. లిస్టులో పేరు లేదనే కారణంతో ఓటు వేయడానికి వచ్చిన వారిని అధికారులు వెనక్కి పంపడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెల్లూరు జిల్లాలోని గూడూరు పోలింగ్ కేంద్రంలోకి నాగుపాము రావడంతో పోలింగ్ సిబ్బంది పరుగులు పెట్టారు.

Advertisement

Next Story