- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగార్జున సాగర్ బరిలో జానారెడ్డి : ఠాగూర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బాస్ ఎవరనే దానిపై కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ స్పందించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారని, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది అని స్పష్టం చేశారు. సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ చాలా కీలకమైనవి తెలిపారు. అంతేగాకుండా ఉపఎన్నిక తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది వెల్లడిస్తామని అన్నారు. అప్పటివరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగుతారని అన్నారు. పీసీసీ ఎన్నికపై నేతలందరి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సోనియా గాంధీకి వివరించానని వెల్లడించారు. కాగా, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించడం ఇప్పటికే మొదలుపెట్టింది. మాణిక్యం ఠాగూర్ సాగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.