గూగుల్, ఫేస్‌బుక్‌లకు సమన్లు..

by Shamantha N |
Google,-Facebook-India
X

న్యూఢిల్లీ : దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఐటీ పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు పంపింది. పౌరుల హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆన్‌లైన్ న్యూస్ మీడియా, సోషల్ మీడియాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం అంశాలపై వాదనలు వినిపించాల్సిందిగా ఆయా సంస్థలను స్థాయి సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రంలోగా ఇరు సంస్థలు పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు హాజరై ఆయా అంశాలపై వాదనలు వినిపించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇరు సంస్థల వాదనను శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్థాయి సంఘం వాదనలు విననున్నది. కాగా ఇప్పటికే ఈ నెల 18న ఇవే అంశాలపై ట్విట్టర్ సంస్థ వాదనలను స్థాయి సంఘం విన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed