జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు?

by Shamantha N |
జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు?
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో గతేడాది నుంచి పార్లమెంటు సమావేశాలు పలు ఆంక్షల మధ్య జరుగుతున్నాయి. గతేడాది శీతాకాల సమావేశాలు రద్దయిపోయాయి. కానీ, ఈ సారి జులైలో షెడ్యూల్ ప్రకారమే వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జులైలోనే ప్రారంభమవుతాయి. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తరుణంలో షెడ్యూల్ ప్రకారమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం తెలిపారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జూన్ మూడో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. గతేడాది జులైలో మొదలుకావాల్సిన వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి మొత్తం మూడు సార్లు పార్లమెంటు సమావేశాలను కుదించగా, చివరి శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. చాలా మంది ఎంపీలు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రెటేరియట్ సిబ్బంది కనీసం ఒక డోసు అయినా టీకా వేసుకోవడంతో జులైలో వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed