బ్రేకింగ్.. ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

by srinivas |
graduate MLC Election poling
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం 958 హాళ్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 609 మంది ఎన్నికల అధికారులు, 1,047 మంది సహాయ ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

ఓట్ల లెక్కింపునకు 11,227 మంది పర్యవేక్షకులు, 31,133 మంది సహాయ పర్యవేక్షకులు పని చేస్తున్నారు. అర్ధరాత్రి దాటినా లెక్కింపు పూర్తిచేసి విజేతలను ప్రకటించనున్నారు. అయితే ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story