- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో రౌడీషీటర్ అరాచకాలు.. నెత్తురోడేలా చావబాదిన మహిళలు
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దోమానా చిన్నారావుకు మహిళలు దేహశుద్ధి చేశారు. పుస్తకాలు, పెన్నులు ఎరచూపి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటంతో మహిళలు దాడి చేశారు.
ట్యూషన్‌కు వెళ్లిన బాలికలు ఉపాధ్యాయులకు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు బాలికల తల్లిదండ్రులు దృష్టికి తీసుకువెళ్లారు. ఓ రాజకీయ నాయకుడి అండ దండలతో రౌడీ షీటర్ దోమనా చిన్నారావు రెచ్చిపోయేవాడు. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండేవాడు. చదువుకునేందుకు సామగ్రి ఇస్తానంటూ ఇంటికి తీసుకెళ్లి వర్ణించలేని రీతిలో బాలికలతో చిన్నారావు ప్రవర్తించేవాడని తెలుసుకున్నారు.
దీంతో కోపోద్రిక్తులైన మహిళలు చిన్నారావును నడిరోడ్డుపై చావబాదారు. ఇంకెప్పుడు ఆడపిల్లల జోలికి వెళ్లను అని చెప్పేంత వరకు ఈడ్చుకుంటూ మరీ చితక్కొట్టారు. ఒంటిపై బట్టలు సైతం చించేశారు. ఇంకెప్పుడు ఆడపిల్లల జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. మహిళలకు సర్దిచెప్పడంతో వారంతా శాంతించారు.