దిశ అంటేనే ట్రెండ్ సెట్టర్.. ఎస్ఐ రామ్మోహన్...

by Sumithra |
దిశ అంటేనే ట్రెండ్ సెట్టర్.. ఎస్ఐ రామ్మోహన్...
X

దిశ, తంగళ్లపల్లి : దిశ అంటేనే పత్రికా రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్ అన్నారు. ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దిశ దిన పత్రిక నూతన సంవత్సర - 2025 క్యాలెండర్ లను ఎస్సై రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దిశ శ్రీకారం చుట్టిందని తెలిపారు.

పత్రికా రంగానికి డిజిటల్ ఎడిషన్ కు పరిచయం చేసిన ఘనత దిశ కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల దిశ ప్రతినిధి దుబ్బాక రాజు, డాక్టర్ దేవరాజ్, ఆరెపల్లి బాలు, పొన్నల పరుశురాం, బూరుగుపల్లి అనిల్ కుమార్, అలుగునూరి నరేష్, నేరెళ్ల అనిల్ గౌడ్, వెంగళ రమేష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed