Norway: మరో రెండు విమానాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం

by Shamantha N |
Norway: మరో రెండు విమానాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: సౌత్ కొరియాలోని విమాన ప్రమాదం మరువక ముందే మరో రెండు చోట్ల త్రుటిలో విమాన ప్రమాదాలు జరిగాయి. కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నార్వేలోని(Norway) టోర్ప్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై అదుపు తప్పింది. బోయింగ్‌ 737-800శ్రేణికి చెందిన విమానం.. ఓస్లో ఎయిర్‌ పోర్టులో టేకాఫ్‌ తీసుకొన్న వెంటనే హైడ్రాలిక్‌ ఫెయిల్యూర్‌ ఏర్పడింది. దీంతో 110 కిలోమీటర్ల దూరంలోని టోర్ప్‌ ఎయిర్‌ పోర్టుకు దీనిని మళ్లించారు. ఇది సురక్షితంగా ల్యాండ్ అయినా.. రన్‌వే పై మాత్రం అదుపుతప్పింది. ఈ విషయాన్ని ఏవియేషన్‌ 24 సంస్థ పేర్కొంది. కాకపోతే ఇది సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారు. ప్రయాణికులను అత్యవసరంగా విమానం నుంచి దించేశారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసి సహాయక చర్యలు చేపట్టారు.

కెనడాలో..

కెనడాలో ఎయిర్‌ కెనడాకు చెందిన విమానానికి శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. హాలిఫాక్స్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ కెనడాకు చెందిన ఏసీ2259 (AC2259) విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఆ సమయంలో దాని ల్యాండింగ్‌ గేర్‌ విఫలం కావడంతో రన్‌వేపై ఓ పక్కకు జారిపోయి మంటలు వచ్చాయి. ఈ విమానం కెనడాలోని సెయింట్‌ జోన్స్‌ నుంచి హాలిఫాక్స్‌కు ప్రయాణిస్తోంది. ఇది డాష్‌ 8-400 రకం విమానంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో దాని రెక్కలు పూర్తిగా రన్‌వేకు రాసుకుపోయాయి. ఆ సమయంలో మంటలు చెలరేగినట్లు వీడియోలో తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement

Next Story

Most Viewed