BSNL: యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ న్యూ ఇయర్ ఆఫర్.. రూ. 277కే 60 రోజుల వ్యాలిడిటీ..!

by Maddikunta Saikiran |
BSNL: యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ న్యూ ఇయర్ ఆఫర్.. రూ. 277కే 60 రోజుల వ్యాలిడిటీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్(New Year) సందర్భంగా కస్టమర్లకు కొత్త ఆఫర్(New Offer)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లకు రూ. 277తో రీఛార్జ్ చేస్తే అన్ లిమిటెడ్(Unlimited) వాయిస్ కాల్స్, 120 GB హై- స్పీడ్(High-speed) డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ వేసుకున్న వారు రోజుకు గరిష్టంగా 2GB వరకు డేటా(Data) వాడుకునే అవకాశం ఉంటుంది. కాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. అయితే ఈ ఆఫర్ 16 జనవరి 2025 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా సిగ్నల్(signal) సరిగా రావట్లేదని, నెట్ చాలా స్లోగా వస్తోందని పలువు కస్టమర్లు గత కొంత కాలంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు, ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే.. గత అక్టోబర్ లో కొత్తగా 5 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవలు అందుబాటులోకి వస్తే యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed