పదేళ్లైంది ఉర్దూ టీచర్ ఎక్కడ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం

by Shyam |
Students Parents protest
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ సుదర్శన్ సర్దార్ నాయక్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఉర్దూ మీడియం పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలం చెందారని మండిపడ్డారు. దీని మూలంగా పిల్లల విద్య భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో సుమారు వందమంది విద్యార్థులు విద్యను అభ్యస్తున్నారని తెలిపారు. కానీ, ఉర్దూ సబ్జెక్టు బోధించే టీచర్‌ను కేటాయించడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. అలాగే ఇతర సబ్జెక్టులకు పూర్తిగా పూర్తి స్థాయిలో బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడం విచారకరమని వెల్లడించారు. ఒకే ఒక్క ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడని, ఇలా అయితే విద్యాహక్కు పూర్తిగా ఉల్లంఘన అయినట్లే అని అన్నారు. జిల్లా కలెక్టర్ మరియు విద్యాధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఇస్మాయిల్, జావిద్, నహీం, మజీద్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed