ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురిని చితకబాదారు

by Aamani |
ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురిని చితకబాదారు
X

దిశ, ఆదిలాబాద్: జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన తమను కాదని ప్రేమ పెళ్లి చేసుకుందనే కారణంతో కూతుర్ని తల్లిదండ్రులు చితకబాదారు.ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే .. తమకు ఇష్టం లేకున్నా ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కూతురు మంజూష పై తండ్రి కాంతారావు, తల్లి పద్మిని, కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో బాధితురాలు మంజూష తీవ్రంగా గాయపడింది.గమనించిన స్థానికులు ఆమెను వెంటనే భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆమె పరిస్థితి విశమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed