- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధోనీనే నా గైడ్ : పంత్
దిశ, స్పోర్ట్స్ : యువ క్రికెటర్, ధోనీ వారసుడిగా భావిస్తున్న రిషబ్ పంత్ కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే పంత్.. ఈ మధ్య ఎందుకో ఎక్కువగా కనపడట్లేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన పంత్.. తన సీనియర్ అయిన ధోనీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ‘క్రికెట్‌లో ధోనీనే తనకు గైడ్ అని.. తన సలహాలు ఇచ్చే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని’ తెలిపాడు. మనకు ఏదైనా సమస్య ఉందంటే ఎవరైనా పూర్తి పరిష్కారం చెబుతారు. కానీ ధోనీ మాత్రం సమస్యకు సంబంధించిన సూచనలు మాత్రమే ఇచ్చి సొంతగా పరిష్కరించుకోమని చెబుతాడని పంత్ వివరించాడు. ‘ఎవరి సమస్యకు వాళ్లే పరిష్కారం వెతుక్కోవాలనేది ధోనీ విధానమని.. ప్రతీ విషయంలోనూ అతను అలాగే వ్యవహరిస్తుంటాడని’ పంత్ వెల్లడించాడు.
ధోనీ అలాంటి సూచనలు చేయడం వల్ల మైదానంలో తాను కీపింగ్, బ్యాటింగ్‌లో చాలా మెరుగైనట్టు వెల్లడించాడు. అంతేకాకుండా టీం ఇండియాలో యువ క్రికెటర్లు తమ స్వీయ సామర్థ్యంతో ఎదగడానికి ధోనీ ఎంతో సాయం చేశాడని చెప్పాడు. ఇక ధోనీ వారసుడిగా ఎవరు ఉంటారనేది సెలెక్టర్లే నిర్ణయించాలని.. మన ఆటను మెరుగుపరుచుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పంత్ వెల్లడించాడు.
Tags : MD Dhoni, Cricket, Rishab Pant, Team India, Wicket Keeper