తాలిబన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పంజ్‌షీర్ సేనలు

by Anukaran |
తాలిబన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పంజ్‌షీర్ సేనలు
X

దిశ, వెబ్‌డెస్క్: తాలిబన్లకు తలొగ్గేది లేదంటూ పంజ్‌షీర్ సేనలు మరోసారి తేల్చి చెప్పాయి. రాజీపడే ప్రసక్తే లేదంటూ.. తాలిబన్ల అంతు చూస్తామంటూ హెచ్చరించాయి. దీంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొనగా.. పంజ్‌షీర్ సేనలకు తజకిస్థాన్ మద్దతు తెలిపింది. ఇప్పటికే వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్‌షీర్ వైపు దూసుకొస్తున్నప్పటికీ.. వారిని తిప్పి కొడుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కాబూల్ ఎయిర్‌పోర్టులో బాంబుల దాడిలో మృతుల సంఖ్య 103కి చేరింది. ఇదే సమయంలో బాంబు దాడులు మళ్లీ జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించినప్పటికీ.. ఆప్ఘన్‌ పౌరులు ఎయిర్‌పోర్టుకే తరలివెళ్లడం గమనార్హం.

Advertisement

Next Story