- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు చేసే పనిని ఒక్కరితో చేయిస్తూ.. మమ్మల్నే అనుమానిస్తారా..?
దిశ, నాగర్‌కర్నూల్ : రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల పనివిధానాన్ని శంకిస్తూ కొత్తగా జీపీ లొకేషన్ యాప్ ఏర్పాటు చేయడాన్ని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తూ శనివారం నాగర్‌కర్నూల్ డీఎల్పీవో రామ్ మోహన్ రావుకు వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి పెరిగిందని, ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డు అసిస్టెంట్లను తొలగించి వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులపై మోపడం ఇబ్బందిగా తయారైందన్నారు.
పల్లె ప్రగతి యాప్ తయారు చేసి పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం మరింత పనిభారాన్ని మోపిందన్నారు. ఇది చాలక మరొక అడుగు ముందుకేసి జీపీ లొకేషన్ యాప్‌ను ఏర్పాటు చేసి ఉదయం 8 గంటలలోపు గ్రామ పంచాయతీలో అటెండెన్స్ ఇవ్వాలని షరతులు పెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పి.మద్దిలేటి, జిల్లా అధ్యక్షులు సీ.మహేష్, జిల్లా కార్యదర్శి జయరామ్, కోశాధికారి శరత్, బాలరాజు, శుభాకర్, జమాల్, శివానందరెడ్డి, ఉమాదేవి, సునీత, సరిత, శ్రీలక్ష్మి, నాగర్ కర్నూల్ డివిజన్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.