విధుల్లో నిర్లక్ష్యం.. 26 మంది కార్యదర్శులకు ఎంపీడీవో షాక్..

by Shyam |   ( Updated:2021-08-18 05:29:26.0  )
mpdo
X

దిశ, పిట్లం : విధుల్లో నిర్లక్షం వహించిన పంచాయతీ కార్యదర్శులు 26 మందికి ఎంపీడీవో వెంకటేశ్వరులు షాక్ ఇచ్చారు. వీరందరికీ మెమోలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హారితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో మొక్కలు నాటే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చకుండా, ఉపాధి హమీ కూలీలకు డబ్బులు చెల్లించడంలో అలసత్వం వహించిన కార్యదర్శులకు మెమోలు జారిచేసినట్టు తెలిపారు. గ్రామ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తారని, అలాంటి వారు విధులలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే గ్రామ అభివృద్ది కుంటు పడే అవకాశం ఉందని అన్నారు. కార్యదర్శులు నిజాయితీగా పనిచేయాలని, లేనియెడల వేటు తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story