పంచాయతీ కార్యాలయంలోనే ఉరేసుకున్న కార్యదర్శి

by Shyam |
Panchayat secretary suicide
X

దిశ, డిండి: కుటుంబ కలహాల కారణంగా ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పెద్దమునిగల్ సమీపంలో బచ్చాపూర్ తండాకు చెందిన కేతావత్ తావు నాయక్(48) మడమడక గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గతకొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఆబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పంచాయతీ కార్యాలయంలోనే ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Next Story