- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాన్ ఇండియా కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు : ధృవ సర్జా
దిశ, సినిమా: కన్నడ స్టార్ ధృవ సర్జా ‘పొగరు’ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది. నంద కిశోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో కూడా అదే రోజున రిలీజ్ అవుతుండగా.. తన మార్కెట్ పెరుగుదలపై స్పందించారు హీరో. కర్ణాటకలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా విడుదల కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు ధృవ. పాన్ ఇండియా సినిమాలు అనేది కొత్త కాన్సెప్ట్ కాదని, గతంలో తన మామయ్య, యాక్షన్ హీరో అర్జున్ సినిమాలు ఏకకాలంలో వివిధ భాషల్లో విడుదల అయిన సందర్భాలు చాలానే ఉన్నాయని గుర్తుచేశాడు. అర్జున్ తనకు ఇన్‌స్పిరేషన్ అని.. చాలా సినిమాల్లో క్రియేటివ్ ఇన్‌పుట్స్ ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
కాగా ధృవ సర్జా.. ఈ సినిమాలో పోర్షన్ కోసం రెండు నెలల్లో 30 కేజీల బరువు తగ్గారు. డైట్ ప్లాన్ ఫాలో కావడాన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నానన్న ధృవ.. క్యాబేజీ, క్యారెట్, బీట్‌రూట్ వంటి వెజిటేబుల్స్‌తోనే డైట్ ఉంటుందని తెలిపాడు. దీన్ని డైట్ కంటే ఉపవాసంగా పిలిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే తను అనుకున్న ఔట్ పుట్ పొందేందుకు ఆకలితో ఉండాల్సి వస్తుందని తెలిపాడు.