- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంత నిర్లక్ష్యమా.. డంపింగ్ యార్డులో పల్లె ప్రకృతి వనం..!
దిశ, కొత్తగూడెం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లె ప్రకృతి వనం కార్యక్రమాలకు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కొన్ని పంచాయతీలు ఈ కార్యక్రమ నిర్వహణలో ముందంజలో ఉండి మెప్పును పొందుతుంటే, లక్ష్మీదేవి పల్లి మండలం లోతువాగు పంచాయతీ మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మొక్కల సంరక్షణలో చివరి స్థానం సంపాదించుకుంది. పల్లె ప్రకృతి వనానికి తీసుకువచ్చిన మొక్కలను నాటకుండా కుప్పలుతెప్పలుగా ఒకచోట ఉంచుతున్నారు. నీళ్లు పోయకుండా వదిలేసి మొక్కల జీవం తీస్తున్నారు.
గతంలో కూడా ఇల్లందు క్రాస్ రోడ్‌లో మొక్కలను నాటకుండా చెట్ల పొదల్లో పడేశారు. ఇప్పుడు పల్లె ప్రకృతి వనంలో నాటేందుకు తీసుకు వచ్చిన మొక్కలు డంపింగ్ యార్డ్‌లో దర్శనమిస్తున్నాయి. అంతేకాక లోతు వాగు పంచాయతీ పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. సాయంత్రం అయితే చాలు మందు బాబులకు అడ్డాగా మారుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.