- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లా వర్సెస్ తీన్మార్..
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మొత్తం 71 మంది అభ్యర్థుల్లో చివరకు పోటీలో ముగ్గురు అభ్యర్థులు మిగిలారు. ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి(1,32,921), తీన్మార్ మల్లన్న(1,08,250), ప్రొఫెసర్ కోదండరామ్‌లు(1,03,030) ఉన్నారు. వీరిలో తక్కువ ఓట్లు ఉన్న కోదండరామ్ ఎలిమినేట్ కానున్నారు. దీంతో కోదండరామ్ ఎలిమినేట్ ప్రక్రియలో ఎవ్వరికీ మెజార్టీ ఓట్లు వస్తాయనేది ఉత్కంఠగా మారింది.
అయితే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ రౌండ్‌లో పల్లాకు 10,282 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 9043 ఓట్లు, కోదండరామ్‌కు 13,623 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధానత్య ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కోదండరామ్ పుంజుకున్నా.. ఓవరాల్‌గా చూస్తే.. మూడో స్థానంలోనే ఉండిపోయారు. దీంతో ఇక కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో తుది పోరులో పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్నగా సాగనుంది.
ఇందులో ఎవరు పైచేయి సాధిస్తే వారినే విజయం వరించనుంది. తీన్మార్ మల్లన్నకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కంటే దాదాపు 24 వేల ఓట్లు తక్కువగా ఉన్నాయి. కోదండరామ్ రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న అంతకుమించి ఓట్లు సాధిస్తేనే విజయం దక్కుతుంది.