రైతులను మోసం చేసేందుకే బీజేపీ కుట్రలు: పల్లా రాజేశ్వర్

by Ramesh Goud |
రైతులను మోసం చేసేందుకే బీజేపీ కుట్రలు: పల్లా రాజేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులను మోసం చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే ధర్నాలు చేస్తోందని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు సోము భారత్, మధులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ముంటే కేంద్ర నుంచి ధాన్యం కొంటామని లేఖ తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ ప్రస్థానం అబద్దాలతో కూడుకున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు సోయి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు జ్ఞానం ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని, రాష్ట్రంలో కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని… ఒకవేళ చేయాల్సి వస్తే ఢిల్లీలో చేస్తారని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed