- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ind Vs Afg మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. ప్రూఫ్స్ ఇవే అంటూ వీడియోలు
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్‌కప్‌లో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి భారత్, అప్ఘానిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలను పాక్ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అప్ఘానిస్తాన్‌తో మ్యాచ్‌లో మరోసారి టాస్ ఓడిపోయాడు. అయితే.. టాస్ గెలిచిన అప్ఘానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ తన నిర్ణయం చెప్పేందుకు మ్యాచ్ ప్రజెంటర్ సమీపానికి వెళ్తుండగా.. అతని కంగ్రాట్స్ చెప్పిన కోహ్లీ.. ‘మీరు మొదట బౌలింగ్ చేయబోతున్నారా..?’ అని అడిగి పక్కకి వెళ్లిపోయాడు. అనంతరం అప్ఘానిస్తాన్ కెప్టెన్ నబీ ‘మేము మొదట బౌలింగ్ చేస్తాం’ అని మ్యాచ్ ప్రజెంటర్‌తో చెప్పాడు.
ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తున్న నెటిజన్లు.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలానే ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ అప్ఘానిస్తాన్ పేలవ ప్రదర్శనకి కూడా ఫిక్సింగ్ కారణాలను చూపుతున్నారు. అయితే యూఏఈలో గత కొన్ని మ్యాచ్‌లుగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
వాస్తవానికి అప్ఘానిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఉంటే..? ఫస్ట్ బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపేది. ఈ విషయాన్ని టాస్ సమయంలో విరాట్ కోహ్లీ కూడా వెల్లడించాడు. అలాంటప్పుడు నబీని ఫస్ట్ బౌలింగ్ చేయమని ప్రలోభానికి గురి చేయాల్సిన అవసరం కోహ్లీకి లేదని భారత క్రికెట్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.
బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే దోశ.. ఎక్కడో తెలుసా.?
ఈ నెల 12న మరో మిలియన్ మార్చ్.. ట్యాంక్ బండ్ మరోసారి రణరంగం కానుందా?
https://twitter.com/iahmadjamshed/status/1455950357117476869?s=20
Confirmed evidence of match fixing, why you sleeping @ICC #T20WorldCup #INDvAFG #INDvsAFG pic.twitter.com/31EnSJqw3V
— Hasnain Shah (@shahhasnain77) November 3, 2021