- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తపు మడుగులో నగ్నంగా మోడల్.. ఆ రాత్రంతా ఏం జరిగింది..?
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లాహోర్‌లోని ఆమె నివాసంలో ఆమె గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసి.. నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి దుండగులు పరారైనట్లు పాకిస్తాన్ న్యూస్ పేపర్ డ్వాన్ వెల్లడించడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. వృత్తిరీత్యా మోడల్ అయిన నయాబ్ నదీమ్(29) కొన్ని యాడ్ షూట్స్ లో పాల్గొంటూ, సినిమా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇంకా వివాహం కానీ నయాబ్ లాహోర్‌లోని ఒక అపార్ట్మెంట్ లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో ఆమె నగ్నంగా, రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆమె సవతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా నదియా సోదరుడు నసీర్ మాట్లాడుతూ ” శనివారం నేను, అక్క కలిసి ఐస్ క్రీం తినడానికి బయటికి వెళ్లాం. ఆ తర్వాత అక్కను ఇంట్లో దింపేసి నేను వెళ్ళిపోయాను. అర్ధరాత్రి అక్క ఫోన్ చేసింది.. కానీ నేను నిద్రపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం తిరిగి తనకు కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. దాంతో తనను చూడటానికి వచ్చిన నాకు రక్తపు మడుగులో అక్క నగ్నంగా పడిఉన్న భయానక దృశ్యం కనిపించింది’’ అని తెలిపాడు. నదీమ్ శరీరంపై, మెడపై తీవ్రమైన గాయాలు ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చానని తెలిపాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నయాబ్ బాత్ రూమ్ కిటికీ పగిలి ఉందని, అందులోనుంచే దుండగులు లోపలికి ప్రవేశించి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.