హోం క్వారంటైన్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

by vinod kumar |
హోం క్వారంటైన్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
X

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలోనికి వెళ్లారు. గత వారం ప్రధాని కలిసిన ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రక్తాన్ని సేకరించి శాంపిళ్లను టెస్టుల కోసం పంపారు. ఈ రోజు సాయంత్రంలోపు రక్త పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15న ఇస్లామాబాద్‌లో ఎది ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎదిని ఇమ్రాన్ ఖాన్ కలిశారు. ఆయన కరోనా వైరస్ సహాయ నిధికోసం ఇచ్చిన పది మిలియన్ పాకిస్తాన్ రూపాయల చెక్కును ఇమ్రాన్ తీసుకున్నారు. ప్రధానికి కలిసిన రెండు రోజులకే ఎదిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆయనకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇమ్రాన్‌ఖాన్‌కు పరీక్షలు చేయడమే కాకుండా.. ఆయనను స్వీయ నిర్బంధానికి వెళ్లమని సూచించారు. కాగా, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రధాని కచ్చితంగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధానికి వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఈ క్లిష్ట సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే విషయంపై ఆందోళనలు వెలువడుతున్నాయి.

Tags: pakistan, pm, home quarantine, corona virus, positive

Advertisement

Next Story