జమ్మూ-కాశ్మీర్‌ను కలుపుతూ పాక్ కొత్తమ్యాప్..

by Shamantha N |
pakistan pm imran khan
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీరు, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు తమ దేశంలోనివే అని పేర్కొంటూ పాక్ తయారు చేసిన మ్యాప్‌కు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మంత్రివర్గం మంగళవారం ఆమోదిం తెలిపింది. గుజరాత్‌లోని జునాగఢ్, మనవడర్‌లతో పాటు సర్ క్రీక్ కూడా పాకిస్థాన్‌లోనివే అంటూ ఈకొత్త మ్యాప్ పేర్కొంది.

పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ నూతన మ్యాప్ పాకిస్థాన్, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు.ప్రపంచం ముందు నూతన పాకిస్థానీ మ్యాప్‌ను పెడుతున్నామని వివరించారు. తాజా రాజకీయ మ్యాప్‌ను పాకిస్థాన్ మంత్రివర్గం, ప్రతిపక్షాలు, కశ్మీరీ నాయకత్వం బలపరుస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీరు విషయంలో గతేడాది భారత్ చేపట్టిన చట్టవిరుద్ధ చర్యను ఈరోజు పాకిస్థాన్ కొత్త మ్యాప్ రద్దు చేసిందన్నారు.

ఇదిలా ఉండగా, గతేడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed