- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ పై ధ్వజమెత్తిన అమెరికా
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల ఆటకట్టడంలో పాక్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంగా మారిందని దాయాది దేశంపై అమెరికా ధ్వజమెత్తింది. దాని శత్రుదేశాలను లక్ష్యం చేసుకుంటున్న ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. నేరారోపణలున్న ఉగ్రవాదులపైనా చర్యలు తీసుకోవడం లేదని, కరడుగట్టిన ఎంతోమంది ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నదని ఆరోపించింది. ఉగ్రవాదంపై వార్షికంగా అమెరికా వెలువరించే ‘కంట్రీ రిపోర్ట్ ఆన్ టెర్రరిజం(2019)’ నివేదికలో పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ
రిపోర్టులోని కీలకాంశాలు:
-ప్రాంతీయంగా కార్యకలాపాలు సాగించే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్వర్గధామంగా కొనసాగుతూనే ఉన్నది.
-భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తాయిబా, దాని అనుబంధ సంస్థలపట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నది.
-పాకిస్తాన్ నుంచి భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు సాగించే అవకాశాన్ని కల్పిస్తున్నది.
-అఫ్గనిస్తాన్‌లో నెత్తురుపారిస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌లాంటి టెర్రరిస్టు సంస్థలకూ అండగా ఉంటున్నది.
-ఈ దేశాల్లో దారుణాలకు ఒడిగట్టిన ఉగ్రవాదులపైనా ఈ దేశం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
-తెహ్రీక్-ఇ- తాలిబన్ పాకిస్తాన్, జైషే మహమ్మద్, లష్కరే తాయిబా, ఐఎస్ఐఎస్-కే, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి కొన్ని ఉగ్రసంస్థలపై చర్యలకు ఉపక్రమించినా శత్రుదేశాలపై దృష్టిపెట్టిన ఉగ్రసంస్థలపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది.
-లష్కరే తాయిబా సహవ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సహా 12 మంది అతని అనుచరులపై నేరారోపణలు చేసినప్పటికీ అధికారులు వారిపై చర్యలు తీసుకునే చొరవను పాక్ కనబరచలేదు.
-జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్, 2008 ముంబయి దాడుల మాస్టర్ మైండ్ సాజిద్ మిర్‌లు పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలో ఉన్నట్టు తెలుస్తున్నది. పాకిస్తాన్ ఈ వాదనలను కొట్టవేస్తున్నా చాలా మంది నిపుణులు మాత్రం అదే నమ్ముతున్నారు.