- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఫెల్ జెట్స్‌కు మేం భయపడం : పాకిస్థాన్
దిశ, వెబ్‌డెస్క్: భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ జెట్స్‌ను చూసి తాము భయపడబోమని పాకిస్థాన్ ప్రకటించింది. 5 కాదు.. 500 రాఫెల్స్ జెట్స్ భారత్ తెచ్చుకున్న తాము సమర్ధవంతంగా ఎదుర్కొంటామని.. ఏ మాత్రం ఆందోళన చెందబోమని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు. ఈ మధ్యకాలలో పాక్ ప్రభుత్వం రక్షణ బడ్జెట్ ను పెంచుతోందని కొందరు తమను విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని గత పదేళ్లుగా పాక్ తన రక్షణ బడ్జెట్‌ను క్రమంగా తగ్గిస్తూ వస్తోందని ఇఫ్తికార్ వివరించారు.
భారత్ మాత్రం ప్రతి ఏడాదీ తన సైన్యాన్ని, రక్షణ సామర్థ్యాన్నిపెంచుకుంటోందని.. రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని బాబర్ ఇఫ్తికార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల భారత్, ఫ్రాన్స్ నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భవిష్యత్‌లో భారత్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, తాము సమర్ధవంతంగా తిప్పికొడతామని ఇఫ్తికార్ తన అభిప్రాయం వ్యక్తంచేశారు.